YS Jagan: జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌పై మూడు కేసులు న‌మోదు

Picture of Victory Media Tv

Victory Media Tv

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జగన్ నెల్లూరు పర్యటనలో మూడు పోలీసు కేసులు నమోదయ్యాయి. జగన్‌ పర్యటనలో వైసీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు నిబంధ‌న‌లు ఉల్లంఘించ‌డంతో పోలీసులు మూడు కేసులు న‌మోదు చేశారు.
మాజీ మంత్రి ప్ర‌స‌న్న ఇంటికెళ్లే రోడ్డు వ‌ద్ద పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్ల‌ను వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు లాగిప‌డేసి.. ప‌రుగులు తీశారు.
దాంతో కావ‌లికి చెందిన స్పెష‌ల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ మాల‌కొండ‌య్య బారికేడ్ కింద ప‌డిపోవ‌డంతో చేయి విరిగింది.
ఈ ఘ‌ట‌న‌లో ప్ర‌స‌న్న‌, బొబ్బ‌ల శ్రీనివాస్ యాద‌వ్‌, పాత‌పాటి ప్ర‌భాక‌ర్ త‌దిత‌రుల‌పై పోలీసులు కేసు న‌మోదు చేశారు.

Leave a Comment

Leave a Comment