మలయాళ నటుడు, మిమిక్రీ కళాకారుడు కళాభవన్ నవాస్ హఠాన్మరణం

Picture of Victory Media Tv

Victory Media Tv

కళాభవన్ నవాస్ నేపథ్యం
నవాస్ 1974లో కేరళలోని వడక్కంచెరిలో జన్మించారు. ఆయన తండ్రి అబూబక్కర్ కూడా నటుడే. కళాభవన్ మిమిక్రీ ట్రూప్‌తో తన కెరీర్‌ను ప్రారంభించిన నవాస్ 1995లో ‘చైతన్యం’ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత ‘మిమిక్స్ యాక్షన్ 500’, ‘జూనియర్ మంద్రాకె’, ‘మట్టుపెట్టి మచ్చన్’, ‘చందమామ’ వంటి చిత్రాల్లో తన హాస్య పాత్రలతో ప్రేక్షకులను అలరించారు. ఇటీవల విడుదలైన ‘ఇజ్హా’ చిత్రంలో ఆయన తన భార్య రెహానతో కలిసి ప్రధాన పాత్రలో నటించారు. ఆయన సోదరుడు నియాస్ బక్కర్ కూడా నటుడే
నవాస్ మ‌ృతికి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మిమిక్రీ ద్వారా సినీ రంగంలోకి ప్రవేశించి, టీవీ సీరియల్స్‌తో కుటుంబ ప్రేక్షకులకు దగ్గరయ్యారని ఆయన కొనియాడారు. సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా తమ సంతాపం తెలిపారు. నవాస్‌కు భార్య రెహానతో పాటు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆయన కుమార్తె మెహ్రీన్ కూడా నటిగా కెరీర్ ప్రారంభించారు. కళాభవన్ నవాస్ తన ప్రతిభ, మిమిక్రీ నైపుణ్యంతో సినీ రంగంలో చెరగని ముద్ర వేశారు. ఆయన ఆకస్మిక మరణం మలయాళ సినీ పరిశ్రమలో విషాదాన్ని నింపింది.

Leave a Comment

Leave a Comment