ఝార్ఖండ్ విద్యా మంత్రి రాందాస్ సోరెన్ ఈ తెల్లవారుజామున తన నివాసంలోని బాత్రూంలో జారిపడ్డారు. ఈ ఘటనలో ఆయన తలకు తీవ్ర గాయాలయ్యాయి. మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఆయన పరిస్థితి విషమంగా వున్నట్టు సమాచారం. మెరుగైన చికిత్స కోసం ఆయనను ఎయిర్ అంబులెన్స్‌లో ఢిల్లీకి తరలిస్తున్నారు.
జంషెడ్‌పూర్‌లోని తన నివాసంలో ఉదయం 4:30 గంటల ప్రాంతంలో రాందాస్ సోరెన్ జారిపడ్డారు. ఈ ఘటనలో ఆయన తలకు, చేతికి గాయాలయ్యాయి. వెంటనే ఆయనను జంషెడ్‌పూర్‌లోని టాటా మోటార్స్ ఆసుపత్రికి తరలించగా ఆయన మెదడులో రక్తం గడ్డకట్టినట్టు వైద్యులు గుర్తించారు. దీంతో ఢిల్లీలోని మేదాంత లేదా అపోలో ఆసుపత్రికి తరలించాలని సూచించారు.
