సీనియర్ జర్నలిస్టు దివాకర్ మృతి

Picture of Victory Media Tv

Victory Media Tv

సీనియర్ జర్నలిస్ట్ పైలా దివాకర్ ఆదివారం మృతి చెందారు.గత కొద్ది రోజులుగా అస్వస్థతకు గురైన ఆయన ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూసారు. ఆంధ్రజ్యోతి,ప్రజాశక్తి పత్రికల్లో పని చేసిన ఆయన సొంతంగా ఓ పత్రిక పెట్టుకుని దానికి ఆయనే ఎడిటర్ గా కొనసాగారు. ఆ తర్వాత కాలంలో విశాఖ 2 ఎమ్మెల్యే సరిపల్లి రంగరాజు వద్ద పీఆరీగా,మరో ప్రైవేట్ కంపెనీకి పీఆర్ఓగా కొంత కాలం పని చేసారు.ప్రస్తుతం ఆయన వైఎస్ఆర్సీపీ పీఆర్వోగా సేవలందిస్తున్నారు. గత కొన్నేళ్లుగా అదే వృత్తిలో కొనసాగుతున్నారు. విశాఖలోని అన్ని మీడియా ప్రతినిధులతో మంచి సత్సంబంధాలు కలిగి ఉన్నారు. ఉత్తరాంధ్రకు చెందిన దివాకర్ పలు కార్పోరేట్ సంస్థలకు కూడా పీఆర్వోగా సేవలందించారు. పదేళ్ల క్రితం ఆయన ఏకైక కుమారుడు సత్యం జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. అప్పటి నుంచీ అవే జ్ఞాపకాలతో జీవిస్తున్న ఆయన చివరికి కొడుకు చెంతకే చేరాడని ఆయన బంధువులంతా కన్నీరు మున్నీరవుతున్నారు. తాటిచెట్లపాలెంలోని ఆయన ఇంటి వద్ద దివాకర్ భౌతికకాయాన్ని పలువురు జర్నలిస్టుల ప్రతినిధులు, రాజకీయ నేతలు సందర్శించి అంజలి ఘటించారు. ఏపీడబ్ల్యుజేఎఫ్ జాతీయ కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, ఉత్తరాంధ్ర విద్యార్ధి సేన వ్యవస్థాపకులు, తెలుగు దేశం పార్టీ నాయకులు డాక్టర్ సుంకర రమణ మూర్తి సంతాపం తెలిపారు. సోమవారం ఉదయం ఆయన అంత్యక్రియలు జరుగనున్నాయని ఆయన బంధువులు తెలిపారు. ఆయనకు భార్య రమ ఉన్నారు.

Leave a Comment

Leave a Comment