విశాఖ జిల్లా అఖిల గాండ్ల తెలికుల సంక్షేమ సంఘం ట్రస్టుబోర్డు చైర్మన్ , ఏపీ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు డా|| పెబ్బిలి రవికుమార్.ఆర్థిక సహాయంతో శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి గిరి ప్రదక్షిణ సందర్భంగా ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 3000 మంది భక్తులకు పులిహోర ప్రసాదం, 100 కేజీల అన్నవరం ప్రసాదం, 1000శెనగపప్పుడు ఉండలు మరియు 10వేల మంచి నీటి బాటిల్స్ ను జిల్లా సంఘం కమిటీ సభ్యుల చేతుల మీదుగా భక్తులకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా డాక్టర్ రవికుమార్ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు శ్రీవరహ లక్ష్మీ నరసింహ స్వామి గిరిప్రదీక్షణ సుమారు 10లక్షల మంది భక్తులు భారీగా తరలివచ్చారు అని వారికి కావాల్సిన అన్ని సదుపాయాలు కూటమి ప్రభుత్వం ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారన్నారు..భక్తులు కావాల్సిన ప్రసాదం వితరణ చేయడం సంతోషం కలిగింది అన్నారు
