పబ్లిక్ తో ముడిపడి ఉన్న ఏ ప్రదేశాలకు వెళ్లినా, ‘మీ వస్తువులకు మీరే బాధ్యులు’ అనే బోర్డులు కనిపిస్తూనే ఉంటాయి. ఈ వాక్యాన్ని టైటిల్ గా తీసుకుని కన్నడలో రూపొందిన సినిమానే ‘నిమ్మ వస్తుగళిగే నీవే జవాబుదారారు’. కేశవ్ మూర్తి దర్శకత్వం వహించిన ఈ సినిమా, జనవరిలో అక్కడ విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది.
అలాంటి ఈ సినిమా ఇప్పుడు ‘సన్ నెక్స్ట్’ ద్వారా ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతోంది. ఈ నెల 27వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ‘సన్ నెక్స్ట్’ వారు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ పోస్టర్ కూడా వదిలారు. ఇది ఆంథాలజీ కాన్సెప్ట్ తో నిర్మితమైన సినిమా. బెంగుళూరు నేపథ్యంలో .. ఒక ముగ్గురు వ్యక్తుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది.
