ప్రముఖ నటి రష్మిక మందన్న తన అభిమానులకు ఓ ఆసక్తికరమైన సవాల్ విసిరారు. తన తదుపరి సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను తాజాగా సోషల్ మీడియాలో విడుదల చేసిన ఆమె, ఆ సినిమా టైటిల్‌ను ఊహించమని కోరారు. మూవీ టైటిల్‌ను సరిగ్గా చెప్పిన వారిని తాను స్వయంగా కలుస్తానని అన్నారు.రష్మిక తన సోషల్ మీడియా ఖాతాల్లో ఈ విషయాన్ని పంచుకుంటూ, “నా తర్వాతి సినిమా టైటిల్ ఏంటో మీరు ఊహించగలరా? నిజానికి ఎవరూ ఊహించలేరని అనుకుంటున్నా… ఒకవేళ మీరు ఊహించగలిగితే, మిమ్మల్ని వచ్చి కలుస్తానని మాటిస్తున్నాను” అని ఆమె పేర్కొన్నారు. కాగా, ఆమె విడుదల చేసిన పోస్టర్‌లో రష్మిక రెండు వైపులా పదునున్న బల్లెం పట్టుకుని, మండుతున్న చెట్టు పక్కన నిలబడి ఉన్నారు. పోస్టర్‌పై “వేటాడబడింది, గాయపడింది, అజేయంగా నిలిచింది” అనే క్యాప్షన్ రాసి ఉంది.
