అన్నమయ్య జిల్లాలో వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డితో పాటు పలువురు ఆ పార్టీ నేతలపై కేసు నమోదైంది. 2024 ఎన్నికల ప్రచార సమయంలో బాణసంచా పేల్చడం వల్ల ఓ వ్యక్తి కంటిచూపు కోల్పోయిన ఘటనకు సంబంధించి ఈ కేసు నమోదు కాగా, ఓ నేతను పోలీసులు అదుపులోకి కూడా తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే… 2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ కార్యకర్తలు లక్కిరెడ్డిపల్లి మండలం అగ్రహారంలో భారీగా బాణసంచా కాల్చారు. ఈ క్రమంలో జరిగిన అపశ్రుతిలో లోకేశ్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడి, ఒక కన్నును కోల్పోయారు. ఈ ఘటనపై బాధితులు జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ)ను ఆశ్రయించారు.
