కేసీఆర్ కలలో కూడా తెలంగాణకు నష్టం చేయరు: కవిత

Picture of Victory Media Tv

Victory Media Tv

మాజీ ముఖ్యమంత్రి, తన తండ్రి కేసీఆర్ కలలో కూడా తెలంగాణకు నష్టం చేయరని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు కేసీఆర్ ప్రాజెక్టులు నిర్మించారని, ఇందుకోసం ఆయన అప్పులు చేశారని, ఆ అప్పులను తన హయాంలోనే తిరిగి చెల్లించారని ఆమె తెలిపారు. ఈ రోజు ఉదయం జూబ్లీహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే రూ.2 లక్షల కోట్ల మేర అప్పు చేసిందని కవిత ఆరోపించారు. ఇంత భారీగా అప్పులు చేసినా సంక్షేమ పథకాలు అమలు కావడం లేదని, మరి ఆ డబ్బంతా ఏమైందని ప్రభుత్వాన్ని నిలదీశారు.
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ జరిగిన తర్వాతే ఏపీలోని బనకచర్ల ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ వచ్చిందని కవిత ఆరోపించారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడేందుకు భయపడి బనకచర్ల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి మౌనం వహిస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్ బిర్యానీ తినిపించి బనకచర్ల నీళ్లను చంద్రబాబుకు అప్పగిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ గతంలోనే “ఆంధ్రా బిర్యానీ” గురించి చెప్పారని గుర్తుచేశారు.

Leave a Comment

Leave a Comment