ఉపకార్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు -75కేజీల భారీ కేక్ ని కట్ చేసిన టిడిపినేత డా.కంచర్ల, మిఠాయిలు, పళ్లరసం పంపిణీ

Picture of Victory Media Tv

Victory Media Tv

ఉపకార్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 75వ జన్మదిన వేడుకులు ఘనంగా నిర్వహించారు. ఆదివారం విశాఖ తూర్పునియోజకవర్గంలోని ఆరిలోవ ట్రస్ట్ కార్యాలయంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు, నిరుపేదల మధ్య ఈ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా కంచర్ల వర్కింగ్ జర్నలిస్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్(కెడబ్ల్యూజెడబ్ల్యూఏ) జాతీయ అధ్యక్షులు, ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ అధినేత, విశాఖ విద్యాదాత, సీనియర్ టిడిపి నాయకులు డా.కంచర్ల అచ్యుతరావు మాట్లాడుతూ, పరిపాలనా ధక్షుడు నారాచంద్రబాబునాయుడుని.. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నఆంధ్రప్రదేశ్ శుభిక్షంగా పేదలకు సంపూర్ణ సంక్షేమం అందుతున్న రాష్ట్రంగా పేరుపొందిందన్నారు. చంద్రబాబుకి ఆ షిర్డీ సాయినాధుడు ఆయురారోగ్యాలు ఇచ్చి ప్రజలకు మరింత ఉత్తమ సేవలు అందించేలా దీవించాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. విజన్ ఉన్న నాయకుడి పరిపాలన దేశంలోనే రాష్ట్రాన్ని నెంబర్ వన్ గా నిలబెట్టే స్థాయికి చేరుకుంటుందని కొనియాడారు. రాష్ట్రాన్ని పరిపాలంచే నాయకుడు ముందుచూపు, సమయస్పూర్తి ప్రజల సంక్షేమానికే ఉపయోగ పడుతందనడానికి సీఎం చంద్రబాబు సుపరిపాలన ఒక నిదర్శనంగా చెప్పుకొచ్చారు. ప్రతీ ఏటా మాదిరిగా గానే ఈ ఏడాది కూడా ఆయన పుట్టిన రోజు భారీ కేక్ ను కట్ చేయడంతోపాటు, నిరుపేదేలకు ద్రాక్షరసం, మిఠాయిలు పంపిణీ చేసి తూర్పునియోజకవర్గంలో వేడుకలు జరుపుకోవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. ఏటా నిర్వహించినట్టుగా ఈ ఏడాది చేపట్టిన జన్మదినోత్సవ కేక్ కటింగ్ లో 75 కేజీల కేక్ నికట్ చేశామని.. ప్రతీ ఏడాదికి ఒక కేజీ చొప్పున పెంచుకుంటూ వస్తున్నామన్నారు. అంతకు ముందు ఆరిలోవ ఆలయాల్లో చంద్రబాబుపేరులో ప్రత్యేక పూజలు నిర్వహించారు. హేపీ బర్త్ డే టూ యూ సీఎం చంద్రబాబు సర్ అంటూ కార్యకర్తలు, నాయకులు చంద్రబాబుకి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపకార్ ఛారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు నాగు, అరుణ, సుధీర్, ఆరిలోవ ప్రాంత టిడిపి నాయకులు, పెద్ద ఎత్తున టిడిపి కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Leave a Comment

Leave a Comment