ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పవర్ లిస్టులో సీఎం చంద్రబాబు

Picture of Victory Media Tv

Victory Media Tv

జాతీయ మీడియా సంస్థలు ఇచ్చే ఒపీనియన్ పోల్స్ , పవర్ లిస్టులకు ప్రాతిపదిక ఉండదు కానీ.. తనకు అనుకూలంగా ఉంటే వాటిని ప్రచారం చేసుకునేందుకు రాజకీయ నేతలు ఆసక్తి చూపిస్తారు. తాజాగా ఇండియన్ ఎక్స్ ప్రెస్ సంస్థ టాప్ హండ్రెడ్ పవర్ ఫుల్ జాబితాను ప్రకటించింది. సహజంగానే నరేంద్రమోదీ ఫస్టులో ఉన్నారు. మరి చంద్రబాబు, రేవంత్, జగన్, కేసీఆర్, కేటీఆర్ ఎక్కడ ఉన్నారన్న సందేహం చాలా మందికి వస్తుంది. చంద్రబాబు దేశ రాజకీయాల్లో ఇప్పుడు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన పవర్ ఫుల్ అని అందరికీ తెలుసు. అయితే చంద్రబాబు కంటే పవర్ ఫుల్ గా ఉన్న వాళ్లు పదమూడు మంది ఉన్నారు. చంద్రబాబు ర్యాంక్ పధ్నాలుగు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఇరవయ్యో స్థానంలో ఉన్నారు. స్టాలిన్ ర్యాంక్ 23, రేవంత్ రెడ్డి ర్యాంక్ 28. ఆయన గత ఏడాది 39లో ఉన్నారు. ఏడాదిలో తన పవర్ పెంచుకున్నారు
రాజకీయాల నుంచి టాప్ హండ్రెడ్‌లో వీరిద్దరూ తప్ప ఇంకెవరూ లేరు. జగన్మహన్ రెడ్డి టాప్ వంద జాబితాలో లేరు.కేసీఆర్ పేరు కూడా లేదు. అయితే అల్లు అర్జున్ పేరు ఉంది. విభిన్న రంగాల్లో అందరి పవర్ ను అంచనా వేసి ఈ జాబితాను తయారు చేశారు. 92వ స్థానంలో అల్లు అర్జున్ ఉన్నారు. వందో స్థానంలో అలియా భట్ ఉన్నారు. వీరు సమాజంపై చూపే ప్రభావం, ఇతర పవర్ పారామీటర్లను ఆధారంగా చేసుకుని .. వారి వారి రంగాల్లో వారు చూపిస్తున్న ప్రభావాన్ని అంచనా వేసి ఈ నివేదికను తయారు చేసినట్లుగా తెలుస్తోంది.

Leave a Comment

Leave a Comment