కంచర్ల మహిళ శక్తి సబ్యులకు కంచర్ల అచ్యుత రావు అభయహస్తం

Picture of Victory Media Tv

Victory Media Tv

విశాఖపట్నం MVP కాలనీలోని ఉషోదయ కార్యాలయంలో, కంచర్ల వర్కింగ్ జర్నలిస్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (KWJWA) ఆధ్వర్యంలో మరియు ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో ఉగాది వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి డాక్టర్ కంచర్ల అచ్యుత రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు..,
కంచర్ల మహిళా శక్తి విభాగం సభ్యులు భారీగా తరలివచ్చారు.. సాంస్కృతిక కార్యక్రమాలు, లైవ్ మ్యూజిక్, డ్యాన్స్ వంటి వినోద కార్యక్రమాలతో ఈ వేడుక మరింత ఉత్సాహభరితంగా సాగింది.ఈ సందర్భంగా డా. కంచర్ల అచ్యుత రావు మాట్లాడుతూ: మహిళలను ఆర్థికంగా నిలబడేలా చేయడం మా ముఖ్య లక్ష్యం. అందుకోసం కంచర్ల టీవీలో మహిళా విలేకరుల కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. ఈ శిక్షణ ద్వారా వారు ఉత్తమ విలేకరులుగా ఎదిగి, తమ జీవితాల్లో ఆర్థికంగా స్థిరపడే అవకాశాన్ని అందిస్తాం. అదనంగా, ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతి సంవత్సరం మహిళా దినోత్సవం సందర్భంగా పది నిరుపేద మహిళలకు 50 గజాల స్థలం రిజిస్ట్రేషన్ చేసి అందజేస్తాం” అని ప్రకటించారు. ఈ ఉగాది వేడుకల్లో సినీ నటుడు, దర్శకుడు యాద్ కుమార్ తన పాటలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అలాగే, జనార్ధన్, సుశీల, డోనాల్డ్-డక్ నాగేశ్వర్ గార్లు కూడా తమ పాటలతో అందరినీ ఉత్సాహపరిచారు. లైవ్ మ్యూజిక్ ప్రదర్శనతో ఆహ్లాదకర వాతావరణాన్ని చేశారు. ఈ వేడుకలో కంచర్ల మహిళా శక్తి సభ్యులకు ఉగాది కిట్లను డా. కంచర్ల అచ్యుత రావు స్వయంగా అందజేశారు. ఉగాది ప్రత్యేకతను తెలియజేస్తూ, మహిళలకు అవసరమైన వస్తువులు అందించారు.
ఈ వేడుకలో కంచర్ల వర్కింగ్ జర్నలిస్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ప్రసాద్, బాలు, సురేష్ కుమార్, అర్జున్ కుమార్, రాజా, జగదీష్, గణేష్ పాల్గొన్నారు. ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు సుధీర్, నాగ, అరుణ తదితరులు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు.
కంచర్ల మహిళా శక్తి – ఆర్థిక స్థిరత్వం కోసం నూతన ప్రణాళికలు ఈ కార్యక్రమంలో కంచర్ల మహిళా శక్తి సభ్యులు ఇందిర ప్రియదర్శిని, రోషిణి, మేరి, సీత, కనకమహాలక్ష్మి, మణి (డ్యాన్సర్), మాధురి, లక్ష్మీ, వాణిశ్రీ, సుమలత, ప్రసన్న, పావని తదితరులు ఉత్సాహంగా పాల్గొన్నారు

Leave a Comment

Leave a Comment