వైసీపీ నేతలకు హెల్త్ అసలు బాగుండటం లేదు. అనారోగ్యంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి వారిలో ఎక్కువ మంది కేసులు ఉన్నవారే. ఇంకా చెప్పాలంటే ఏ క్షణమైనా పోలీసులు వస్తారని ..తలుపులు కొడతారని బయపడేవారే. విచిత్రం ఏమిటంటే వారి అనారోగ్యాన్ని చూపించి మరికొందరు ముందస్తు బెయిల్స్ కోసం ప్రయత్నాలు చేయడం. ఈ వైసీపీ నేతల అనారోగ్యం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.
కొడాలి నాని గ్యాస్టిక్ ట్రబుల్ తో ఆస్పత్రిలో చేరారు. ఇన్ పేషంట్ గా చేరి రకరకాల పరీక్షలు చేయించుకున్నారు. ఆయనకు గుండెనొప్పి అని ప్రచారం జరిగింది. నిజానికి కొడాలి నాని ఆస్పత్రిలో ఇన్ పేషంట్ గా చేరింది..
