చెన్నైకి చెందిన ఓ టెక్కీ వివాహ వివాదంపై అతని భార్య దాఖలు చేసిన ఫిర్యాదుకు సంబంధించి ఆయనను వేధించవద్దని మద్రాస్ హైకోర్టు పోలీసులను ఆదేశించింది.
వివరాల్లోకి వెళితే… రిప్లింగ్ సహ వ్యవస్థాపకుడు ప్రసన్న శంకర్ చెన్నై పోలీసులు తనను వేధించారని, తన భార్య తనపై తప్పుడు ఫిర్యాదు చేసిందని ఆరోపించారు. ఈ మేరకు మద్రాస్ హైకోర్టు పిటిషన్ వేశారు. పోలీసులు తన తల్లి ఇంటికి వెళ్లి తన స్నేహితుడిని అక్రమంగా అరెస్టు చేయడమే కాకుండా, తన ఆచూకీపై విచారణ నిర్వహిస్తున్నారని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. చెన్నైలోని తన వెకేషన్ హోమ్‌పై పోలీసులు దాడి చేసి, కేర్‌టేకర్ ఫోన్ తీసుకోవడంతో పాటు సీసీటీవీ కెమెరాలను స్వాధీనం చేసుకున్నారని ఆయన ఆరోపించారు.
