వర్కింగ్ జర్నలిస్టులంతా ఆర్ధికంగా కుదుటపడేందుకు ప్రత్యేక ఆర్ధిక వ్యవస్థ ఏర్పాటు చేయనున్నట్టు కంచర్ల వర్కింగ్ జర్నలిస్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు, ఉపకార్ ఛారిటబుల్ ట్రస్టు చైర్మన్, ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ అధినేత, విశాఖ విద్యాదాత, ప్రముఖ సంఘసేవకులు డా.కంచర్ల అచ్యుతరావు పేర్కొన్నారు. బుధవారం జర్నలిస్ట్ష్ ఆసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నిర్వహించి ఉగాది సంబురాలకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఏ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, జర్నలిస్టులు లేనిదే సమాజంలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదన్నారు. సమాజంలో జరిగే విషయాలన్నీ ఒక్క జర్నలిస్టు మాత్రమే మీడియా ద్వారా అన్ని విషయాలు బయటపెతాడని అన్నారు. జర్నలిస్టులంతా ఒకే తాటిపైకి రావడం ద్వారా సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం అవుతుందన్నారు. ప్రస్తుతం ఒక జర్నలిస్టుకి కష్టం వస్తే మరో యూనియన్ జర్నలిస్టు గానీ, నాయకులు గానీ ముందుకి రావడం లేదన్నారు. అది మంచి పద్దతి కదాన్నారు. జర్నలిస్టుఅనే వ్యక్తికి కష్టమొత్తస్తే మీడియా మొత్తం ముందడుగు వేయాలన్నారు. సమాజంలో ఫోర్త్ పిల్లర్ గా ఉన్న మీడియా అంటే తనకు చాలా అభిమామన్నారు. అలాంటి జర్నలిస్టులకు చేయూత నందించేందుకు ప్రత్యేక ఆర్ధిక వ్యవస్థ ఏర్పాటు చేయనున్నామన్నారు. ఇటీవలే ప్రారంభించిన కంచర్ల వర్కింగ్ జర్నలిస్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్(కెడబ్ల్యూజెడబ్ల్యూఏ) ఆవిర్భావాన్ని పురస్కరించుకొని జర్నలిస్టులందరికీ మెడీ క్లైమ్ ఇన్స్యూరెన్స్ లు చేయిస్తున్నామన్నారు. నిరుపేద జర్నలిస్టులు, వారి పిల్లల చదువుల కోసం ఉపకార్ ఛారిటబుల్ ట్రస్ట్ నుంచి ఫీజులు కూడా చెల్లిస్తున్నట్టు చెప్పారు. విశాఖలో జర్నలిస్టుకి ఏ కష్టమొచ్చినా ఈ కంచర్ల అచ్యుతరావు ఉన్నాడనే విషయాన్ని ఎవరూ మరిచిపోవద్దన్నారు. ప్రత్యేక ఆర్ధిక వ్యవస్థ ద్వారా ప్రతీ జర్నలిస్టుకీ ప్రతీనెలా నిర్ధిష్టమైన ఆదాయం తెప్పించడానికి చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. మీడియాలో పనిచేసేవారికి సహాయం అందించేందుకు ఎల్లప్పుడూ తన ఇంటి తలుపులు తెరిచే ఉంటాయన్నారు. తనకు యూనియర్లు, వర్గాలు, గ్రూపులతో పనిలేదన్నారు. సహాయం కోరి వచ్చేది జర్నలిస్టు అయితే చాలని.. తనకున్న పరిధిలో తాను సహాయ సకరారాలు అందిస్తానని చెప్పారు. మరో అతిధి డా.రామ్ కుమార్ మాట్లాడుతూ, జర్నలిస్టులకు తమ ఆసుపత్రి ద్వారా ఉచిత వైద్యసేవలు అందిస్తున్నామని..ఇపుడు అన్ని వర్గాల జర్లిస్టులు, అన్ని సంఘాల వారికి తమవంతు సహకారం అందిస్తామని చెప్పారు. అనంతరం జాప్ యూనియన్ నేతలు డా.కంచర్ల అచ్యుతరావుని ఘనంగా సత్కరించి, సన్మానించారు. అంతకుమందు అనంతరం జాప్ మాజీ అధ్యక్షులు సుంకరి సూర్యం, జిల్లా అధ్యక్షుడు సింగంపల్లి శ్రీనివాస్, ఇతర కమిటీ నాయకులను డా.కంచర్ల సన్మానించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి కీర్తన, నాయకులు రామక్రిష్ణ, నవీన్, తదితరులు పాల్గొన్నారు.
