విశాఖపట్నంలో మళ్లీ లులూ మాల్ నిర్మాణానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. 218లోనే ప్రారంభం కావాల్సిన నిర్మాణం జగన్ అధికారంలోకి రాగానే తరిమేయడంతో ఇక ఏపీలో పెట్టుబడులు పెట్టబోమని ఆ సంస్థ ప్రకటించింది. అయితే చంద్రబాబు మరోసారి సీఎం అయిన తర్వాత ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడంతో పెట్టుబడులు పెట్టడానికి అంగీకరించింది. తాజాగా ఆ సంస్థకు విశాఖ వీఎంఆర్డీఏ ద్వారా 14 ఎకరాలు కేటాయించేలా ప్రక్రియను ప్రారంభించింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం ద్వారా ఈ మాల్, భారీ కాన్ఫరెన్స్ హాల్స్ నిర్మించనున్నారు.
లులూ గ్రూప్ భారతదేశంలో తమ రిటైల్ వ్యాపారాన్ని విస్తరిస్తోంది, ఇప్పటికే కేరళ , తెలంగాణ వంటి ప్రాంతాల్లో మాల్‌లను నిర్మించింది. విశాఖపట్నం వంటి నగరంలో మాల్ నిర్మాణానికి ఆసక్తి చూపిస్తోంది. విశాఖపట్నం ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న నగరం కావడం, ప్రభుత్వం నుండి పెట్టుబడులకు ప్రోత్సాహకాలు లభించనుండటంతో వేగంగా మాల్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని లులు భావిస్తోంది.
