14 ఏళ్ల నుండి 40 సంవత్సరాల మధ్య గల యువతీ యువకులకు వారి లక్ష్యాల సాధనకు అనుభవజ్ఞుల చే దిశ నిర్దేశం చేసేలా జెసిఐ సహకరిస్తుందని సభ్యులు జోన్ వైస్ ప్రెసిడెంట్ చైతన్య, వైజాగ్ అచీవర్స్ ప్రెసిడెంట్ డాక్టర్ సోమశేఖర్, చైతన్యం కాన్ఫరెన్స్ డైరెక్టర్ డా. శీతల్ తెలిపారు. మే 25 సాయి ప్రియ రిసార్ట్లో లో ఉదయం 10 నుండి సాయంత్రం 6 వరకు జరిగే చైతన్యం 2025 కార్యక్రమానికి సంబంధించిన వివరాలను వెల్లడించేందుకు డాబా గార్డెన్స్ లో గల ఒక హోటల్లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… దశాబ్ద కాలానికి పైగా జేసిఐ సామాజిక బాధ్యతతో వ్యక్తిత్వ, సంస్థాగత అభివృద్ధితోపాటు వ్యాపార విస్తరణ అవకాశాలపై విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహిస్తూ అండగా నిలుస్తుంది అన్నారు. అదే క్రమంలో జెసిఐ జోన్ 4 రీజన్ C, సభ్యులు సాధించిన విజయాలు, సాధించాల్సిన లక్ష్యాలు తదితర అంశాలపై ఈ నెల 25న చైతన్యం కాన్ఫరెన్స్ లో చర్చిస్తామన్నారు. సామాజిక బాధ్యతతో ముందడుగు వేస్తున్న చైతన్యం విన్నర్స్ కు బహమతులను అందించి ప్రోత్సహిస్తామని తెలిపారు.
