సినీ ప్రపంచంలోప్రతిష్టాత్మకంగా భావించే దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కి కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ‘క’ మూవీ నామినేట్ అయింది. ఢిల్లీలో ఈ నెలాఖరున జరిగే అవార్డుల ప్రదానోత్సవంలో ఉత్తమ చిత్రాన్ని ప్రకటించనున్నారు. కాగా సుజీత్, సందీప్ తెరకెక్కించిన ఈ మూవీ గతేడాది అక్టోబర్లో విడుదలైంది. చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ వద్ద 55 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టింది. కిరణ్ నటనకు థియేటర్లు షేక్ అయ్యాయి నయన్ సారిక, తన్వీరామ్ లు ఇద్దరు హీరోయిన్లుగా నటించారు.
