వర్కింగ్ జర్నలిస్టు గుండెకి నిండైన మనుసుతో డా.కంచర్ల ఆర్ధిక భరోసా..!

Picture of Victory Media Tv

Victory Media Tv

విశాఖలోని వర్కింగ్ జర్నలిస్టు గుండెకి ఉపకార్ ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, విశాఖ విద్యాదాత, కంచర్లవర్కింగ్
జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు, ఎస్-ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ అధినేత డా. కంచర్ల అచ్యుతరావు రూ.50 వేలు గుండె శస్త్రచికిత్స నిమిత్తం ఆర్ధిక సహాయం చేస్తానని నిండుమనసుతో ప్రకటించారు. శనివారం మధురవాడలోని సృజన నాట్య కళామండలి, ఉపకార్ ఛారిటబుల్ ట్రస్ట్ కంచర్లవర్కింగ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్వర్యంలో ఉగాది సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ముఖ్య అతిథి డా. కంచర్ల మాట్లాడుతూ, విశాఖలోని జర్నలిస్టులంతా ఉగాది వేడుకులు చక్కగా జరుపుకోవాలని శుభాకాంక్షలు. తెలియజేశారు. జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు ప్రకటించిన ఆయన జర్నలిస్టుల ఆర్థికాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపకల్పన చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా స్థానిక జర్నలిస్టు రాముకి ఇటీవలే గుండెకి బైపాస్ సర్జర్ జరిగిందని, అయినా మళ్లీ ఇబ్బంది వస్తే ఆయనను పరీక్షించిన వైద్యులు గుండెకి ప్రత్యేకమైన చిప్ ను అమర్చాలని సూచించారని, దానికి రూ.5 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పగానే.. ఎవరూ అధైర్య పడొద్దని రాము గుండె ఆపరేషన్ తనవంతుగా రూ. 50వేలు. అందజేస్తానని ఆర్థిక భరోసా ఇచ్చారు. సదరు జర్నలిస్టు వివరాలను KWJWA కార్యాలయంలో తెలియజేసి. సహాయం పొందాలని సూచించారు. సమాజంలో వీటితోపాటు జర్నలిస్టు ఆర్థిక భరోసా కల్పించే విధంగా ఎస్ఎస్ఎల్ఎఎస్ క్రియేషన్స్, కంచర్ల, దినపత్రిక, కంచర్ల టెలివిజన్ ద్వారా ఉద్యోగ అవకాశాలతో పాటు వారి టేలెంట్ నబీబట్టి జీత బత్యాలు కూడా అందిస్తామన్నారు. జర్నలిస్టు బాగుంటేనే సమాజంలో ఏం జరిగినా అది ప్రజలకు తెలుస్తుందన్నారు. అలాంటి జర్నలిస్టులకు ఎంత సహాయం చేసినా, ఎంత చేయూత అందించినా తక్కువేనన్నారు. విశాఖలోని జర్నలిస్టులకు ఎప్పుడు, ఎక్కడ ఎలాంటి ఆరోగ్య కష్టమొచ్చినా వెంటనే తనకు తెలియజేయాలని.. ఆపదలో చేయూత అందించడానికి రూ.10వేలు ఆర్థిక సహాయాన్ని అందిస్తామని చెప్పారు. ముందుగా ప్రకటించిన విధంగా వచ్చే ఉగాది నుంచి రియలెస్టేట్ సంస్థ ద్వారా వేసే వెంచర్లలో నిరుపేద జర్నలిస్టులకు ఉచితంగా 50 గజాల ఇంటి స్థలాన్ని అందించడంతో పాటు, అంతర్జాతీయ ప్రమాణాలతో
బాడంగి దగ్గర కార్పోరేట్ పాఠశాలను కూడా స్థాపిస్తున్నామన్నారు. అక్కడ జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య అందించనున్నామని పేర్కొన్నారు. ఈలోగా నిరుపేద జర్నలిస్టుల పిల్లల విద్యకు ఉపకార్ ఛారిటబుల్ ట్రస్టు ద్వారా సహకారం అందిస్తామన్నారు.

Leave a Comment

Leave a Comment