ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ 75వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఆయనకు పార్టీలకు అతీతంగా జాతీయ స్థాయిలో నేతలు శుభాకాంక్షలు తెలిపారు. కూటమి నేతలు, టీడీపీ శ్రేణులు, సాధారణ ప్రజలు సైతం చంద్రబాబుకు బర్త్ డే విషెస్ తెలియజేశారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు. “నా పుట్టినరోజున మీరు అందించిన శుభాకాంక్షలు, మీరు చూపించిన అభిమానం, ఆప్యాయతతో నా మనసు ఉప్పొంగింది. ఇప్పటివరకు నా ప్రయాణంలో నాకు తోడుగా నిలిచినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు.
